2008 లో భగవద్గీతా ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి హాజరై తనవంతు చేయూతగా లక్ష రూపాయలు విరాళం అందించి - భగవద్గీతా ప్రచారానికి తోడ్పడిన వదాన్యుడు వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ శ్రీ రాజేందర్ రెడ్డి పుష్కరకాలం తర్వాత హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ సంస్థ లో అడుగు పెట్టారు. ఫౌండేషన్ చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి - శ్రీ రాజేందర్ రెడ్డి ని దుశ్శాలువతోను, తులసి మాల తోను సత్కరించగా ఫౌండేషన్ అడ్వొకసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు, ఎల్ విశ్వతేజ, సంపూర్ణ భగవద్గీతా గాన ప్రతిని అందించారు. ఇబ్రహీం పట్నం లోని వినోభానగర్ డెవలప్మెంట్ సొసైటీ లో తమ సామాజిక కార్యక్రమాల గురించి రాజేందర్ రెడ్డి వివరించారు. ప్రకృతి ఆశ్రమం, సిద్ధార్థ యోగా విద్యాలయం ద్వారా తాము చేస్తున్న కార్యక్రమాల ద్వారా తాము పొందుతున్న ఆనందాన్ని ఆసక్తికరం గా వివరించారు. ముఖ్యం తమ ప్రకృతి ఆశ్రమం ద్వారా ప్రకృతి వైద్యులు డా.కె .వై.రామచందర్ రావు - మధుమేహం, రక్తపోటు వంటి రోగాలనుండి అనేకమందికి శాశ్వత విముక్తిని కలిగించినట్టు చెప్పారు....