కరీంనగర్ జిల్లా లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ధర్మపురి లో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ధ గాయకులు గంగాధర శాస్త్రి గానం చేసిన సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత - భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సువర్ణ హస్తాల లోకి బహుమతి గా చేరింది.

ఈ రోజు (1-4-2019) హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు హాజరైన శ్రీ నరేంద్ర మోడీ ని బి జె పి నాయకులు అంత క్రితం బేగంపేట విమానాశ్రయం లో ఘన స్వాగతం పలికారు.

బి జె పి నాయకురాలు, భగవద్గీతా ఫౌండేషన్ సభ్యురాలు అయిన శ్రీమతి గీతా మూర్తి - ఫౌండేషన్ తరపున గంగాధర శాస్త్రి గానం చేసిన భగవద్గీత ప్యాక్ ను శ్రీ మోడీ కి బహుమతి గా ఇచ్చి స్వాగతం పలికారు.

ఇది దశాబ్ద కాలం కృషితో రూపొంది, అటుపై భారత రత్న డాII అబ్దుల్ కలాం ప్రశంసలు పొంది, తెలుగు జాతి కి అంకితం చేయబడ్డ విశిష్ట ప్రయత్నమని, గీతా మూర్తి మోడీ కి వివరించగా-మోదీ అభినందిస్తూ ఈ గీతను తాను తప్పక వింటానన్నారు.

ఈ ప్రయత్నం జరుగుతున్న సమయం లో మోదీ - భగవద్గీతా ఫౌండేషన్ ను అభినందిస్తూ రాసిన లేఖని ఈ సందర్భం గా ఆమె ప్రస్తావించారు.