ఆగిరిపల్లి (కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ) లోని శ్రీ శోభనాద్రి లక్ష్మి నృసింహ వేదశాస్త్ర పాఠశాల లో ఫిబ్రవరి 1 న - భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గీతా గానప్రవచనం చేసారు. వందలాదిమంది వేదాభ్యాసం చేస్తున్న విద్యార్థులు, సంస్కృత విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలను ఉద్దేశించి గీతా వైభవాన్ని వివరిస్తూ, ప్రస్తుతపరిస్థితులలో గీత పఠనం, ప్రచారం ఎంతో ఆవశ్యకమని, ఈ దేశం లో ఇతర మతాల దుస్చేష్టల వల్ల హిందూ ధర్ర్మం ఉనికి కి ప్రమాదం ఏర్పడిందని, దీనికి కారణం హిందువులు తమదైన ధర్మాన్ని కాపాడుకోవడం లో చూపిస్తున్న నిర్లక్ష్యమే ననీ గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. భగవద్గీతాధ్యయనం తో స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చునని తన గీతా గాన ప్రసంగం లో తెలిపారు. కార్యక్రమ అనంతరం విజయవాడ శారదా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఉపద్రష్ట వేంకటరమణ, శ్రీ శోభనాద్రి లక్ష్మి నృసింహ వేదశాస్త్ర పాఠశాల శ్రీ లు శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు.